Header Banner

తిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. ఒక్క రోజులోనే రూ. 1 కోటి రూపాయలను విరాళం..

  Fri Apr 25, 2025 14:46        Devotional

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు భారీ విరాళం అందింది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వాణిజ్య సంస్థ అపర్ణ ఎంటర్ ప్రైజెస్ (వెటిరో టైల్స్) ఈ ట్రస్ట్ కు రూ. 1 కోటి రూపాయలను విరాళంగా సమర్పించింది. సంస్థ ప్రతినిధులు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు రూ. కోటి విరాళానికి సంబంధించిన చెక్కును చైర్మన్ కు అందజేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే వేలాది మంది భక్తులకు నిత్యం అన్నప్రసాదాన్ని అందించే కార్యక్రమంలో తమవంతు సహకారం అందించినట్లు వారు తెలిపారు. ఈ భారీ విరాళాన్ని స్వీకరించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, దాతృత్వానికి ముందుకు వచ్చిన అపర్ణ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ప్రతినిధులను అభినందించారు. దాత కుటుంబ సభ్యులకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అన్నప్రసాదం వంటి కీలకమైన కార్యక్రమానికి విరాళం అందించడం ప్రశంసనీయమని చైర్మన్ పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

 

విశాఖలో వైసీపీకి ఊహించని షాక్! ఒకవైపు అరెస్టుల కలకలం... మరోవైపు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై!

 

ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్! రాబోయే మూడు రోజులు ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన కుండపోత వర్షం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TTD #Tirupati #Bus